Monday, August 9, 2010

Names with letter B

BabruvAhanuDu-బభృవాహనుడు : బభృవాహనుడు అర్జునుడు మరియు మణిపురపు రాకుమారి చిత్రాంగదలకు కలిగిన కుమారుడు. అర్జునుడు అరణ్యవాసం చేయు సమయమున మణిపురపు రాకుమారి చిత్రాంగదను చూచి వలచాడు. చిత్రాంగద తండ్రి అయిన చిత్రవాహనునికి ఆమె ఒక్కతే సంతానం. చిత్రవాహనుడు చిత్రాంగదకు కలిగే సంతానము మణిపురములోనే ఉండి రాజ్యమును పరిపాలించవలెను అని పెట్టిన షరతుకు అంగీకరించి అర్జునుడు చిత్రాంగదను వివాహము చేసికొన్నాడు. బభృవాహనుడు తన తాత తదనంతరం మణిపురమును పాలించాడు.


 Bali chakravarti:బలిచక్రవర్తి -- బలి చక్రవర్తి దానాలలో శిబి చక్రవర్తి అంతటి వాడు. దశావతారాలలో శ్రీమహావిష్ణువు ఐదవ అవతారమైన వామనుడు  మూడు అడుగుల స్థలం అడుగగా బలి దానమివ్వగా, వామనుడు(హరి) తివిక్రమ రూపాన్ని ఎత్తి రెండు పాదాలతో ఆకాశం, భూగోళం నింపగా, మూడో అడుగు ఎక్కడ అని ప్రశ్నించగా బలి తన శిరస్సు చూపుతాడు.

BarbareekuDu -బర్బరీకుడు :  బర్బరీకుడు మహాభారతంలో ఘటోత్కచుని కుమారుడు. కురుక్షేత్ర సంగ్రామంలో ఇతడు శ్రీకృష్ణుని చేత వధించబడ్డాడు.


Bhavani : భవాని --హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

Bharavi : భైరవి --హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

Balaramudu : బలరాముడు -- బలముచే జనులను రమింపచేయువాడు., వీరు స్వయం భగవానుడు అయిన శ్రీకృష్ణుల వారికి సోదరులగా జన్మించిన అంశావతారము. వీరి ఆయుధము హలము , నాగలి. వీరు గొప్ప వీరులు, దయామయులు, కృష్ణుని అన్ని వేళలా తోడు గా ఉన్నవారు. వీరి భార్య రేణుక .

Badrakaali : బద్రకాళి -- పార్వతి ( Parvati) మరో పేరు . హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, బద్రకాళి, శ్యామ, ఉమ వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

Bruhaspati : బృహస్పతి - బృహత్తులకు (వేదమంత్రాలకు) ప్రభువు (బృహస్‌పతి).బృహస్పతి కి ఇంకో పేరు గురుడు. బృహస్పతి దేవతలకు గురువు. బృహస్పతి భార్య తార చంద్రుని అందానికి మోహించి పతిలేని సమయంలో చంద్రుని తో రతి సరసాలు జరిపెను . అందువలన గర్భవతి అయ్యెను. ఈమెను చంద్రుడు తీసుకొనిపోగా, బృహస్పతితో యుద్ధం జరిగెను. ఇంతలో తారకు బుధుడు జన్మించెను. తగవు తీర్చడానికి వచ్చిన బ్రహ్మ తారను అడిగి నిజం తెలుసుకొని బుధుని చంద్రునకు, తారను బృహస్పతికి ఇప్పించెను.

Bharatudu : భరతుడు - అశేషమైన భూమిని భరించిన (పోషించిన) వాడు.
1.భరతుడు రామాయణంలో దశరథుని కుమారుడు మరియు శ్రీరాముని తమ్ముడు. శ్రీరాముడు శివధనుర్భంగం చేసిన తరువాత జనక మహారాజు తమ్ముడైన కుశధ్వజుని కుమార్తె అయిన మాండవిని భరతునితో వివాహం జరిపిస్తారు. సింహాసనాన్ని తిరస్కరించి, శ్రీరాముని పాదులకు పట్టాభిషేకం జరిపి, 14 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు.
2. భరతుడు మహాభారతములో శకుంతల-దుష్యంతుల కుమారుడు . భరతుడు పరిపాలించిన దేశము గనుక భారతదేశము అని పేరు వచ్చినది .

Bhimudu : భీముడు - భయమును కలిగించువాడు . భీముడు పాండవ ద్వితీయుడు. మహాభారత ఇతిహాసములో వాయుదేవుడి అంశ. పాండురాజు సంతానం. కుంతికి వాయుదేవునికి కలిగిన సంతానం. ద్రౌపతి , హిడింబి ఇతని భార్యలు . హిడింబాసురుణ్ణి వధించి తనని వరించిన ఆతని సోదరి హిడింబి అను రాక్షస వనితను కుంతీ ధర్మరాజాదుల అనుమతితో వివాహమాడినాడు. వారిరువురికీ కలిగిన సంతానమే మహాభారత యుద్దమందు తన మాయాజాలముతో వీరంగము చేసి ప్రసిద్దుడైన ఘటోత్కచుడు. కురుక్షేత్ర సంగ్రామంలో ఆరు అక్షౌహిణుల మేర శత్రుసైన్యాన్ని నిర్జించినాడు. ధుర్యోధన దుశ్శాసనాది కౌరవులు నూర్గురినీ భీమసేనుడే వధించినాడు.

Bhishmudu : భీష్ముడు - తండ్రి సుఖము కొరకై తను రాజ్య సుఖములను వదులుకోవడమే కాక వివాహం చేసుకోను అని భీష్మమైన (భయంకరమైన) ప్రతిజ్ఞ చేసినవాడు. ఆ జన్మ భ్రహ్మచారి . మహాభారతంలో గంగాదేవీ శంతనమహారాజుకి జన్మించినాడు , భీష్ముడు పూర్వ నామం "దేవవ్రతుడు". భారతంలో ఒక ప్రధానమైన, శక్తివంతమైన పాత్ర భీష్ముడిది. సత్యవర్తనుడిగా, పరాక్రముడిగా భీష్ముని పాత్ర అనిర్వచనీయమైనది.

BaaNaasuruDu : బాణాసురుడు -- వెయ్యి బాహువులు కల్గిన బాణాసురుడు బలి చక్రవర్తి కుమారుడు. బాణాసురుని వంశపరంపర-> * బ్రహ్మ కుమారుడు పరిచుడు * పరిచుని కుమారుడు కాశ్యపుడు * కాశ్యపుని కుమారుడు హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు * హిరణ్యకశ్యపుని కనిష్ఠ పుత్రుడు ప్రహ్లాదుడు * ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు * విరొచుని కుమారుడు బలి చక్రవర్తి * ఆ బలి కొడుకే ఈ బాణాసురుడు * ఆ బాణాసురుని భార్య కండల.
వీడు అకుంఠిత దీక్షతో పరమ శివుని ధ్యానించి అయన్ని మెప్పించి తనకు రక్షణ గా శోణపురానికి తెచ్చుకొన్నాడు. ఈ అసురుని చూస్తే సమస్త భూలోకం, స్వర్గలోకం కూడా గజగజ వణికి పోతూ ఊండేది. ఒకసారి వీడికి రణకండుతి చాలా ఎక్కువై శివునితో మహాదేవా నువ్వుతప్ప నాతో యుద్ధం చేసేవారేలేరా అని అనగా శివుడు వీని రణకండూతికి , మూర్ఖత్వానికి చింతించి నీ రధం మీద ఉన్న జండా క్రిందకు పడినప్పుడు నిన్ను జయించేవాడు వస్తాడు అని చెప్తాడు.


  • ==================================================
Visit my Website - > Dr.Seshagirirao-MBBSh

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog material