Monday, August 9, 2010

Names with letter K

  •  
Kamadhenuvu-- కామధేనువు : కోరిన కోరికలు తీర్చే దివ్య శక్తులు గల గోవు


Kumaara swaami :కుమార స్వామి -  శివ పార్వతుల ఇద్దరి కుమారులలో చిన్నవాడు కుమారస్వామి. ఇతనికి ఇద్దరు బార్యలు -- శ్రీవల్లి , దేవసేన .

Katyaayini : కాత్యాయిని --హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

Kali : కాళి --హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

కాళిదాసు,Kalidasu :  ఒక గొప్ప సంస్కృత కవి మరియు నాటక కర్త. "కవికుల గురువు" అన్న బిరుదు ఇతని యొక్క ప్రతిభాపాటవాలకు నిలువెత్తు సాక్షం. గొప్ప శివ భక్తునిగా భావింపబడే కాళిదాసు, తన యొక్క కావ్యములు మరియు నాటకములు చాలావరకు హిందూ పురాణ మరియు తత్త్వ సంబంధముగా రచించాడు. కాళిదాసు అను పేరుకు అర్థం కాళి యొక్క దాసుడు.

Karnudu : కర్ణుడు -- పుట్టుకతో 'కర్ణ'కుండలాలు కలవాడు. మహాభారత ఇతిహాసములో ఒక వీరుడు. దూర్వాస మహర్షి కుంతీభోజుని కుమార్తెయైన కుంతి కి ఇచ్చిన వరప్రభావంతో సూర్య దేవునికి ఆమెకు కలిగిన సంతానము కర్ణుడు. సూర్యుని అంశాన సహజ కవచకుండలాలతో జన్మించిన కర్ణుడు సూర్యతేజస్సుతో ప్రకాశించినాడు.

kaushikudu : కౌశికుడు - ధర్మ వ్యాధునివల్ల ధర్మ విశేషాలు తెలుసుకున్నవాడు . విశ్వామిత్రునికి మరో పేరు .

Kauravulu : కౌరవులు -- కురువంశరాజులు . మహాభారతం లో దుర్యోధనాదులు వందమంది . కురువంశములో జన్మించిన వారిని కౌరవులు అంటారు. కానీ మహాభారతములో ప్రధానముగా ధృతరాష్ట్రుని సంతతిని సూచించటానికే ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. గాంధారికి జన్మించినవారు 100 మంది పుత్రులు, 1 పుత్రిక. ఒక వైశ్య వనిత ద్వారా ధృతరాష్ట్రునికి మరొక పుత్రుడు యుయుత్సుడు జన్మించాడు. కురుక్షేత్ర సంగ్రామంలో గాంధారి పుత్రులు అందరూ మరణించారు.

Kedaareswarudu : కేదారేశ్వరుడు - శివునికి మరో పేరు . కేదారేశ్వర ఆలయము హిమాలయాలలో, గర్ వాల్ జిల్లా, ఉత్తరప్రదేశ్ - మందాకినీ నదీ సమీపంలో ఉన్నది , మంచుకారణంగా ఈ దేవాలయం సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే దర్శనమునకు తెరచి ఉంటుంది.

Kaikeyi : కైకేయి --అశ్వపతి కూతురు . దశరధమహారాజు ముడో భార్య . భరతుని తల్లి .

Kuberudu : కుబేరుడు -- హిందూ పురాణాల ప్రకారం యక్షులకు రాజు మరియు సిరి సంపదలకు అధిపతి. ఈయన్నే ధనపతి అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఎనిమిది దిక్కులలో ఒకటైన ఉత్తర దిక్కుకు అధిపతి అనగా దిక్పాలకుడు. ఈతని నగరం అలకాపురి. ఇతడు విశ్రవసుని కుమారుడు. ఈయన భార్య పేరు చార్వి.

Kumbhakarna : కుంభకర్ణుడు -- రామాయణం కావ్యంలో రావణుని తమ్ముడైన ఒక రాక్షసుడు. అసాధారణ బలవంతుడు, మహాకాయుడు. కుంభకర్ణుడు విశ్రవసు మనువుకు కైకసికి అసురసంధ్యవేళలొ సంభోగం వల్ల జన్మించిన సంతానం. ఆరు మాసాలు నిద్రపోతాడు, ఒక్కరోజు మేలుకొని ఉంటాడు"

Kucheludu : కుచేలుడు--చినిగిన లేక మాసిన వస్త్రము కలవాడు (చేలము అనగా వస్త్రము). శ్రీ కృష్ణుడి సహాధ్యాయి. ఈయన అసలు పేరు సుధాముడు. కుచేలోపాఖ్యానము మహా భాగవతము దశమ స్కందము లో వస్తుంది. కుచేలుడు శ్రీ కృష్ణునికి అత్యంత ప్రియమైన స్నేహితుడు. శ్రీ కృష్ణుడు ,కుచేలుడు ..సాందీపని వద్ద విద్యాభ్యాసము చేస్తారు. అప్పుడు శ్రీ కృష్ణుడికి సహాధ్యాయి కుచేలుడు. విద్యాభ్యాసము అయ్యాకా శ్రీ కృష్ణుడు ద్వారక చేరుకొన్నాడు. కుచేలుడు తన స్వగ్రామము చేరుకొన్నాడు

KamsuDu : కంసుడు -- ఉగ్రసేనుని కుమారుడు , శ్రీకృష్ణుని మేనమామ . మధురా నగరాన్ని యాదవవంశానికి చెందిన శూరసేన మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆయనకు వసుదేవుడు అనే కుమారుడు ఉండేవాడు. వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకిని ఇచ్చి వివాహం చేస్తారు. చెల్లెలు అంటే ఎంతో ప్రేమ కల కంసుడు ఆమెను అత్తవారి ఇంటికి రథం మీద సాగనంపుతుంటే అశరీరవాణి దేవకి గర్భం లో పుట్టిన ఎనిమిదో కుమారుడు కంసుడిని సంహరిస్తాడు అని చెబుతుంది. కంసుడు దేవకిని, వసుదేవుడిని, ఆడ్డువచ్చిన తన తండ్రి ఉగ్రసేన మహరాజును కూడా చెరసాలలో పెడతాడు

KabanduDu : కబంధుడు -- రామాయణములో రాముని చేత సంహరింపబడిన దండకారణ్యము లో ఉన్న ఓ వికృతరూపము గల రాక్షసుడు. ఈతను దట్టమయిన రోమములు గలవాడనియు, పర్వతమువంటి భీకరమైన శరీరముగలవాడనియు, తల మరియు మెడ లేనివాడనియు, ఉదరభాగమునందు క్రూరమయిన దంతములు గల నోరు గలవాడనియు, పొడవాటి చేతులు మరియు వక్షమందు ఓ పెద్ద కన్ను కలవానిగను వర్ణించిరి. కొందరు ఇతడు లక్ష్మీదేవి కొడుకుగా చెప్పిరి. ముందుగా కబంధుడు ఒక గంధర్వుడు ఒక ముని శాపముచే కబంధునకు ఆ వికృత రూపము ప్రాప్తించెను.

Kalpavrukshamu : కల్పవృక్షము -- కోరిన కోరికలు ఇచ్చే చెట్టు. ఇది దేవతలు దానవులు కలిపిచేసిన క్షీర సాగర మథనం సమయంలో పుట్టింది. దీనిని దేవతలకు రాజైన ఇంద్రుడు గ్రహిస్తాడు. బహుళ ప్రయోజనాలున్న తాటి, కొబ్బరి మొదలైన కొన్ని చెట్లను కల్పవృక్షాలుగా పేర్కొంటారు. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన విశిష్టమైన పద్య కావ్యము రామాయణ కల్పవృక్షం అంటారు ..

kashyapuDu : కశ్యపుడు -- ప్రజాపతులలో ముఖ్యుడు. వాల్మీకి రామాయణం ప్రకారం బ్రహ్మ కొడుకు కొడుకు(మనమడు). ఇతనికి ఇరవైఒక్క మంది భార్యలు. వీరిలో దితి, అదితి, వినత, కద్రువ, సురస, అరిష్ట, ఇల, ధనువు, సురభి, చేల, తామ్ర, వశ, ముని మొదలైనవారు దక్షుని కుమార్తెలు. ఇతనికి బ్రహ్మ, విషానికి విరుగుడు చెప్తాడు. పరశురాముడు ఇతనికి భూమినంతా దానం చేస్తాడు. ఇతనికి అరిష్టనేమి అనే పేరుంది.

Khandavam , ఖాండవం (వనము) : ఇంద్రుని వనము . అగ్నిదేవుడు ప్రార్ధించగా కృష్ణార్జునులు దానిని అతనికి ఆహారము గా ఇచ్చారు .

కృపి ,Krupi : మహాభారతంలోని పాత్ర. ఈమె కృపాచార్యుని సోదరి మరియు ద్రోణుని భార్య..

జననం-- శరధ్వంతుడు ఒక రాజు. ధనుర్విద్య ఇతనికి పుట్టుక తోనే ప్రాప్తించింది. కొంతకాలం తపస్సు చేసి అన్ని యుద్ధవిద్యల్లో ఆరితేరాడు. ధనుర్విద్యలో తిరుగులేని మహావీరుడైనాడు. ఇంద్రుడు అద్భుత సౌందర్య రాశియైన జలపది అనే దేవకన్యను ఆయన బ్రహ్మచర్యాన్ని ఆటంకపరచేందుకు నియమించాడు. మహా సౌందర్యవతి అయిన ఆమెను చూచినదే సత్యధృతి చేతిలోని విల్లమ్ములు జారి క్రిందపడ్డాయి. అది గ్రహించి తన కామోద్రేకమును నిగ్రహించుకొనెను. కాని, అతనికి రేతః పతనమై ఆ వీర్యము రెల్లుగడ్డిలో పడెను. అది రెండు భాగములై అందులోనుంచి ఒక బాలుడు, ఒక బాలిక జన్మించారు.

కొంతకాలమునకు శంతన మహారాజు వేటాడుచు అక్కడికి వచ్చి వారిని చూచి తన బిడ్డలుగా పెంచుకొన్నాడు. వారికి జాతక కర్మాది సంస్కారములు గావించి తనచే కృపతో పెంచబడ్డారు కావున వారికి కృపుడు మరియు కృపి అని నామకరణము చేయించాడు. కృపుడు విలువిద్యయందు పరమాచార్యుడై భీష్ముని ప్రార్ధనమున కౌరవ పాండవులకు గురువు అయ్యాడు. కృపిని ద్రోణాచార్యుడు పరిణయం చేసుకున్నాడు. వీరికి కలిగిన పుత్రుడే అశ్వత్థామ.

కురువంశము, Kuru Dynasty : భరతుడి తరువాత వంశం--భరతుడి కుమారుడు భుమన్యుడు, భుమన్యుడి కుమారుడు సుహోత్రుడు, సుహోత్రుడి కుమారుడు హస్తి , హస్తి పేరు తోనే ఉన్నదే అప్పటి కురురాజుల రాజధాని, ఇప్పటి ఢిల్లీ నగరమైన హస్తినాపురం. హస్తి కుమారుడు వికంఠనుడు, వికంఠనుడి కుమారుడు అజమేఢుడు. అజమేఢుడికి 124 కుమారులు. వాని కుమారులలో ఒకడైన సంవరణుడికి సూర్యుని కుమార్తె అయిన తపతికి వివాహం జరిగింది. వారి కుమారుడు కురు. కురు పేరు తోనే కురువంశం వృద్ధి చెందింది. కురు కుమారుడు విదూరధుడు. విదూరధుడి కుమారుడు అనశ్వుడు. అనశ్వడి కుమారుడు పరిక్షిత్తు , పరిక్షిత్తు కుమారుడు భీమసేనుడు. భీమసేనుడు కొడుకు ప్రదీపుడు. ప్రదీపుడి కుమారుడు శంతనుడు.

  • ======================================
Visit my Website - > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog material