Monday, August 9, 2010

Names with letter S

Shakti : శక్తి --హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

Sambudu : సాంబుడు -- జాంబవతి , శ్రీక్రిష్ణులకు జన్మించిన కుమారుడు .

Satyabhama - సత్యభామ : శ్రీకృష్ణుని భార్య సత్యభామ , ఈమె తండ్రి సత్రాజిత్తు (సత్రాజిత్తు ను శతధన్వుడు అనేవాడు సంహరించి శమంతక మణిని చేజిక్కించుకున్నాడు. శమంతక మణిని అపహరించుకుపోవటమేకాకా తన మామ అయిన సత్రాజిత్తును సంహరించిన శతధన్వుడిని శ్రీకృష్ణుడు హతమార్చెను .

Syaama : శ్యామ --హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

Shakuntala : శకుంతల -- మేనక, విశ్వామిత్రుల సంతానము. దుష్యంతుని భార్య మరియు భరతుని తల్లి. విశ్వామిత్రుడి తపస్సు భంగం చేయడానికి ఇంద్రుడు మేనక ను పంపిస్తాడు. మేనక చేత ఆకర్షితుడైన విశ్వామిత్రుడు తపస్సు నుండి రతిక్రీడ లోకి మారతాడు. రతిక్రీడ ఫలితంగా మేనక గర్భవతి అవుతుంది. విశ్వామిత్రుడు బయటి వాతావరణం చూసి శిశిర ఋతువు అవడం గ్రహించి తపోభంగం జరిగిందని గ్రహించి, మేనకను అక్కడ నుండి పంపివేస్తాడు. మేనక ఆడబిడ్డను ప్రసవించి, ఇసుక దిబ్బ మీద విడిచి, వెళ్ళిపోతుంది. అలా విడిచిన బిడ్డను పక్షులు తమ రెక్కలతో రక్షిస్తాయి. ఆ మార్గములో వెళ్ళుతున్న కణ్వ మహర్షి ఆ బిడ్డను చూసి పక్షుల రెక్కల చేత రక్షింపబడడం వల్ల శకుంతల అని పేరు పెట్టి, తన ఆశ్రమంలో పెంచి పెద్దచేస్తాడు.

Shantanudu : శంతనుడు
-- శం = సుఖము/శుభము తను = విస్తరింపజేయుట , సుఖమును, శుభమును విస్తరింపజేయువాడు. అని అర్దము . శంతనుడు మహాభారతంలో హస్తినాపురాన్ని పరిపాలించిన సూర్యవంశానికి చెందిన రాజు. భరతుడి వంశక్రమానికి చెందినవాడు. పాండవులకు మరియు కౌరవులకు పూర్వీకుడు. హస్తినాపురానికి రాజైన ప్రతీపునికి వృద్ధాప్యంలో జన్మించిన కనిష్ట పుత్రుడు

Shasti Devi : షస్టీదేవి -- మూల ప్రకృతిలోని అరోభాగం నుంచి జన్మించిన దేవత .

Shivagamga : శివగంగ -- బ్రహ్మ మానస పుత్రుడైన అంగీరసుడి భార్య .

Shurabhi : సురభి -- దేవతల గోవు

శకుని -Shakuni :     గాంధార  రాజైన సుబలుని కుమారుడు . సుబలుడు తన కుమార్తెలైన గాంధారి , సత్యసేన , సత్యవ్రత మొదలైన వాళ్ళను ధృతరాష్ట్రునకు ఇచ్చి వివాహము చేసాడు . శకుని మహాభారతంలో గాంధారి కి తమ్ముడు. దుర్యోధనుని మేనమామ. ఇతనికి ఇద్దరు సోదరులు వృషకుడు, అచలుడు. ఇతని కొడుకు ఉలూకుడు.

శకునిని అతని అన్నలనూ కౌరవులు ఒక చెరసాలలో బంధించి, వారికి రోజూ ఒక్క మనిషికి సరిపోయే ఆహారం మాత్రం ఇస్తారు. కౌరవుల మీద ఎలా ఐనా ప్రతీకారం తీర్చుకోవాలనుకొన్న శకుని సోదరులు, తమ భాగం ఆహారాన్ని కూడా శకుని కి ఇచ్చి, తమ పగ తీర్చమని చెప్తారు.

దుర్యోధనుని దురాలోచనలకు ఇతడు సహాయం చేస్తుండేవాడు. ఇతడే ధర్మరాజుని మాయా జూదంలో ఓడించినది. వనవాసము చేయుచున్న పాండవులను ఏదో విధంగా చంపమని బోధించినది కూడా ఇతడే. కురుక్షేత్ర సంగ్రామంలో ఇతన్ని నకుల సహదేవులు సంహరించిరి.

  • ====================================
Visit my Website - > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog material