Monday, August 9, 2010

Names with letter Y

Yama : యముడు , యమధర్మరాజు - యమము (లయ)నుపొందించువాడు. యముడు లేదా యమధర్మరాజు హిందూ పురాణాలలో తరచు కనవచ్చే ఒక పాత్ర. నరక లోకానికి అధిపతి. సూర్యుని కుమారుడు. పాపుల పాపములను లెక్క వేయుచూ, సమయము ఆసన్నమైనపుడు ప్రాణములు తీయుట యముని పని. కాలుడు అని మరియొక పేరు . యముడు దక్షిణ దిశకు అధిపతి, గొప్ప జ్ఞాని, భగవద్భక్తుడు. నచికేతునికి ఆత్మ తత్వ జ్ఞానం ఉపదేశించాడు (కఠోపనిషత్తు). తన దూతలకు భగవంతుని మహాత్మ్యాన్ని వర్ణించాడు (స్కంద పురాణము). యముని వద్ద పాపుల పద్దులను లెక్కించుటకు చిత్రగుప్తుడు అను సహాయకుడు ఉంటాడు. * భార్య పేరు ' శ్యామల * సోదరులు : వైవస్వతుడు, శని * సోదరీమణులు: యమున, తపతి

Yashoda : యశోద -- యశస్సును (కీర్తి) కలిగించునది. భాగవతము లో యశోద నందుని భార్య గోకులవాసి .. శ్రీకౄష్ణుని పెంపుడు తల్లి . బలరాముడు , సుబద్రలు ఈమె వద్దనే పెరిగేరు . యశోదా-నందులకు ' ఏకనంగా ' అనే సొంత కూతురు ఉందటారు .

YaagyavalkuDu :యాజ్ఞవల్కుడు -- ప్రాత:స్మరణీయులైన ఋషిపరంపరలో యాజ్ఞవల్క్య మహర్షి ఒకరు. ఈయన భాష్కలుని వద్ద ఋగ్వేదము,జైమిని వద్ద సామవేదము అరుణి దగ్గర అధర్వణవేదమును అభ్యసించారు. వైశంపాయుని వద్ద యజుర్వేదాద్యయనము కూడా చేసాక విద్యాహంకారము కలిగి గురుశాపానికి గురై తాను నేర్చుకున్న వేదజ్ఞానమంతా రుధిర రూపము లోగక్కి శాపాన్ని బాపుకున్నారు. ఆయన గక్కిన పదార్దాన్ని తిత్తిరిపక్షులు తిని తిరిగి అవి పలుకగా ఉపనిషత్తులయ్యాయి. అవే తైత్తిరీయోపనిషత్తులుగా ప్రసిద్దికెక్కాయి. ఆతరువాత యాజ్ఞవల్కుడు సూర్యభగవానుని ఆరాధించి ,శుక్లయజుర్వేదాన్ని నేర్చుకొని గురువుకన్నా గొప్పవాడయ్యాడు. సరస్వతీదేవిని ఉపాసించి సమస్త విద్యలు సాదించాడ. తరువాత కాత్యాయిని అనే ఆమెను వివాహము చేసుకున్నాదు. గార్గి శిష్యురాలైన మైత్రేయి యాజ్ఞవల్కుని తప్ప మరొకర్ని వివాహము చేసుకోనని శపధముచేసి , కాత్యాయిని స్నేహము సంపాదించి ఆమె సమ్మతితో యాజ్ఞవల్కుని రెండవ భార్య అయినది. మహాజ్ఞాని,తపోనిధి, అయిన యాజ్ఞవల్కునికి మాఘ శుద్ద పౌర్ణమినాడు యోగీంద్ర పట్టాభిషేకము చేసారు. ఆయన ఋషులకు తెలియజేసిన విషయాలే యోగశాస్త్రమని,యోగయాజ్ఞవల్కమని ప్రసిద్ధికెక్కాయి. కర్మజ్ఞానము వలన మోక్షము కలుగుతుందని తెలియజేసిన ప్రా:స్మరణీయుడు యాజ్ఞవల్కుడు .ఆయన జయంతి రోజు 20-11-2007 నాడు ఆయన్ని ఆరాధిస్తే జ్ఞానసంపత్తి కలుగుతుంది.

YudhisturuDu :యుధిష్టిరుడు -- ధర్మరాజు కు యుధిష్టిరుడని మరొక పేరు , మహాభారతము లో పంచపాండవులలో మొదటివాడు . . సత్యము, అహింస మొదలగు ధర్మములను పాటించే రాజు. కుంతి భర్త అనుమతి పొంది ధర్ముని వలన(యమధర్మరాజు) కన్న సంతానము కనుక ధర్మజుడని, యుద్ధమునందు స్థిరమైన పరాక్రమమును ప్రదర్శించువాడు కనుక యుధిష్టిరుడని పేర్లు కలిగాయి. జూదము లో ఓడిపోయి విరాట కొలువులో కంకుభట్టు గా ఉంటాడు .



  • ================================
Visit my Website - > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog material